© 2026 nimisham.in

Anakapalle: నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే! Anakapalle: పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని ఎమ్మెల్యే బొబ్బిలి RVSKK రంగారావు (బేబీ...
Anakapalle: నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే!
Anakapalle: పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని ఎమ్మెల్యే బొబ్బిలి RVSKK రంగారావు (బేబీ నాయన) దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం అమ్మవారి ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, అనకాపల్లి ప్రాంతం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని శ్రీ నూకాంబిక అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్, టెంపుల్ డైరెక్టర్లు పొలిమేర ఆనంద్ కుమార్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజు, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ మీడియా కోఆర్డినేటర్ ఎస్. భానుచందర్ (అఖి)తో పాటు పలువురు ముఖ్య నాయకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.