© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి వార్తల్లో నిలిచింది. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత ప్రధాన కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను తొలగించి,...
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి వార్తల్లో నిలిచింది. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత ప్రధాన కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను తొలగించి, ఏడుగురు ఆటగాళ్లను స్వదేశానికి పంపిన మరుసటి రోజే పీసీబీ మళ్లీ వార్తల్లోకెక్కింది. మొన్నటివరకు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న షేన్ మెక్‌డెర్మాట్ పదవీకాలం జులైలో ముగిసింది. ప్రస్తుతం ఆ పదవి ఖాళీగా ఉంది. ఫీల్డింగ్ కోచ్ పదవిని భర్తీ చేయడానికి పాకిస్థాన్ దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, ఇందులో వింతేముంది అంటారా.. ఆగండి అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది మరి. కోచ్ నియమకానికి పీసీబీ ఏకంగా లింక్డ్ఇన్లో ఓపెన్ హైరింగ్ మొదలుపెట్టింది. పాకిస్థాన్ బోర్డు ఎంచుకున్న ఈ విధానాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. తమదైన శైలిలో విమర్శలు, సెటైర్లతో ఆటాడుకుంటున్నారు.
‘‘నాకు ఆశ్చర్యంగా ఉంది! పీసీబీలో ఉద్యోగాల భర్తీ పూర్తిగా ప్రతిభ ఆధారంగానే జరుగుతోందా? ఇక్కడ సిఫార్సులు, పలుకుబడి ఏమీ పనిచేయవా?’’ అని ఓ యూజర్ వ్యంగ్యంగా స్పందించాడు. ‘‘దీన్ని ఇక్కడ ఎందుకు పోస్ట్ చేస్తున్నారు?ఆ పని కోసం నేరుగా ఏదైనా రిటైర్డ్ మిలిటరీ లేదా ఆర్మీ సిబ్బందిని సంప్రదించండి’’ అని మరో యూజర్ సెటైర్ వేశాడు. ‘‘దీనికి దరఖాస్తు చేద్దామని అనుకుంటున్నాను. గత 13 ఏళ్లుగా నేను ఇండస్ట్రియల్ ఆటోమేషన్ రంగంలో పనిచేశాను. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘ఈ పదవి గురించి ఆసక్తిగా ఉంది.. మొన్న రెండు క్యాచ్‌లు డ్రాప్ చేశా’’ అని మరో యూజర్ వ్యంగ్యంగా అన్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.