© 2026 nimisham.in
Gold Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు గత మూడేళ్ల కాలంలో కొన్ని రకాల గోల్డ్ ఫండ్స్ ఊహించని రీతిలో భారీ లాభాలు అందించాయి.
వాల్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం గత 3 సంవత్సరాల కాలంలో లంప్ సమ్ పెట్టుబడిపై ఏడాదికి 25 శాతం కంటే ఎక్కువ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR) రాబడిని అందించిన టాప్-5 పథకాల గురించిన వివరాలు ఎకనామిక్ టైమ్స్ విశ్లేషించింది. ఇందులో నాలుగు గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఎస్బీఐ, యాక్సిస్ వంటి దిగ్గజ సంస్థల స్కీమ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం.యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్యూటీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (UTI Gold ETF FoF) గడిచిన మూడు సంవత్సరాల కాలంలో సగటున వార్షిక రాబడి 36.14 శాతంతో అందించింది. ఇందులో మూడేళ్ల క్రితం రూ.1 లక్ష లంప్ సమ్ విధానంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.2.52 లక్షలు అవుతుంది.Read Also: NFOs: మ్యూచువల్ ఫండ్స్‌లో మరో 3 కొత్త స్కీమ్స్.. ఈరోజు నుంచే షురూ.. రూ.100 ఉన్నా చేరొచ్చు!క్వాంటమ్ గోల్డ్ ఈటీఎఫ్క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన క్వాంటమ్ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (Quantum Gold ETF FoF) గత మూడేళ్ల రిటర్న్స్ చూసుకుంటే సగటున ఏడాదికి 35.98 శాతం రాబడులు ఇచ్చింది. మూడేళ్ల క్రితం లంప్ సమ్‌గా రూ.1 లక్ష పెట్టి ఇప్పటి వరకు కొనసాగినట్లియితే ఆ విలువ రూ.2.51 లక్షలు అవుతుంది.ఎస్బీఐ గోల్డ్ ఫండ్ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన ఎస్బీఐ గోల్డ్ ఫండ్ (SBI Gold Fund) గడిచిన 3 ఏళ్లలో సగటున వార్షిక రాబడి 35.77 శాతం చొప్పున అందించింది. ఇందులో లంప్ సమ్ విధానంలో మూడేళ్ల క్రితం రూ.1 లక్ష పెట్టినట్లియితే ఇప్పుడు ఆ విలువ రూ. 2.50 లక్షలు అవుతుంది.యాక్సిస్ గోల్డ్ ఫండ్యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన గోల్డ్ స్కీమ్ యాక్సిస్ గోల్డ్ ఫండ్ (Axis Gold Fund) గత మూడేళ్లలో ఏడాదికి 35.20 శాతం చొప్పున రాబడి అందించింది. మూడేళ్ల క్రితం రూ.1 లక్ష లంప్ సమ్ విధానంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.2.47 లక్షలు అవుతుంది.హెచ్ఎస్బీసీ మిడ్ క్యాప్ ఫండ్హెచ్ఎస్బీసీ మిడ్ క్యాప్ ఫండ్ (HSBC Midcap Fund) సీఏజీఆర్ గత మూడేళ్లలో చూసుకుంటే 25.11 శాతంగా ఉంది. రూ. 1 లక్ష లంప్ సమ్ పెట్టుబడి విలువ ఇప్పుడు రూ.1.95 లక్షలు అవుతుంది.Disclaimer: ఈ కథనం సమాచారం అందించేందుకే. పెట్టుబడులను ప్రోత్సహించడం లేదు. పెట్టుబడిదారులు గతంలో వచ్చిన రాబడులను చూసి గుడ్డిగా ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. మీ రిస్క్ సామర్థ్యం, పెట్టుబడి లక్ష్యం, ఆర్థిక లక్ష్యం వంటి అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలి. నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.