© 2026 nimisham.in

భారతీయులు రెగ్యులర్ గా ఇష్టంగా తినే బ్రేక్ ఫాస్ట్ లలో దోశ ఒకటి. దోశలు ఇంట్లో చేసుకోవడం కూడా చాలా సులువు. కానీ, హోటల్ లో తిన్న ఫీలింగ్ ఇంట్లో తింటే రాదు.
హోటల్ మాదిరిగా మంచి షేప్, రంగు, రుచి ఇంట్లో చేసినప్పుడు రావు. అంతేకాదు, ఎప్పుడు దోశ వేద్దామని చూసినా.. పెనానికి అతుక్కుపోతూ ఉంటుంది. మీరు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అయితే.. పెనానికి అతుక్కోకుండా.. దోశ హోటల్ స్టైల్ లో మంచిగా రావాలి అంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.
దోశ పెనానికి అతుక్కోకుండా మంచిగా రావాలంటే.. పిండిలో స్పెషల్ గా ఏమీ కలపాల్సిన అవసరం లేదు. చిన్న ఉల్లిపాయతో మీరు మ్యాజిక్ చేసేయచ్చు. మీ ఇంట్లో ఉన్న ఐరన్ పెనాన్ని.. ఈ ఉల్లిపాయతో నాన్ స్టిక్ పెన్ లా మార్చేయచ్చు. అసలు దోశలు వేయడం రానివారు కూడా చాలా ఈజీగా దోశలు వేసేసుకోవచ్చు. అయితే, అలా ఉల్లిపాయను ఎలా వాడాలో చూద్దాం...
ఉల్లిపాయను ముందుగా సగానికి కోయాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయకు ఫోర్క్ గుచ్చి, దానికి 2 నుంచి 3 చుక్కల నూనె రాయాలి. తర్వాత.. ఐరన్ పెనాన్ని వేడి చేయాలి. పెనం బాగా వేడిగా మారిన తర్వాత నూనె రాసిన ఉల్లిపాయను పెనం మొత్తం సర్కిల్ షేప్ లో రుద్దాలి. ఉల్లిపాయలోని సహజ రసాలు, నూనె కలిసి ఇనుప నేలపై ఒక కోటింగ్ లా ఏర్పడతాయి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు చల్లి శుభ్రమైన గుడ్డతో తుడిచి పిండి వేయండి. దోశ రవ్వల్లా పరుచుకుని, అస్సలు అంటుకోకుండా లేచి వస్తుంది.
ఒకవేళ ఉల్లిపాయ అందుబాటులో లేకపోతే, గ్లాసు నీళ్లలో అరస్పూన్ ఉప్పు కలిపి ఆ నీటిని పెనంపై చల్లి తుడిచినా దోశలు అంటుకోవు. పిండి పెనంపై రుద్దేటప్పుడు మంట ఎప్పుడూ సిమ్‌లో ఉండాలి. రుద్దడం పూర్తయ్యాక మంటను మీడియం-హైకి పెంచితేనే దోశ కరకరలాడుతుంది. ఐరన్ పెనాన్ని ప్రతిసారీ డిష్‌వాష్ సోప్‌తో తీవ్రంగా తోమకూడదు. సబ్బుతో తోమితే దానిపై ఉన్న ఆయిల్ సీజనింగ్ పోయి మళ్లీ అంటుకోవడం మొదలవుతుంది. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. దోశలు మంచిగా ఎర్రగా కరకరలాడుతూ.. పెనానికి అంటుకోకుండా వస్తుంది.