© 2026 nimisham.in
మాస్ మహారాజా రవితేజ , సున్నితమైన భావోద్వేగాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భావోద్వేగ భక్తిరస చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన ప్రజాదరణను దక్కించుకుంది. రవితేజ మార్క్ ఎనర్జీకి తోడు, కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే శివ నిర్వాణ కథా కథనాలు సినిమాను బ్లాక్‌బస్టర్ దిశగా నడిపించాయి. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి రవితేజ కెరీర్లోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఈ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది.12 రోజుల్లోనే రూ. 200 కోట్లు ఈ అప్రతిహత విజయ యాత్రను కొనసాగిస్తూ కేవలం 12 రోజుల్లోనే 'ఇరుముడి' ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఈ ఘనతను పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, యువత నుంచి కుటుంబ ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ థియేటర్లలో ఈ చిత్రాన్ని ఒక ఉత్సవంలా ఆదరిస్తున్నారని మేకర్స్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ఇది జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.సడెన్‌గా హాస్పిటల్లో చేరిన మమితా బైజు... డాక్టర్లు ఏం చెబుతున్నారంటేనైజాంలో కాసుల వర్షంఆంధ్రా, సీడెడ్ ఏరియాలతో పాటు ఓవర్సీస్లోనూ 'ఇరుముడి' అద్భుతమైన కలెక్షన్లు రాబడుతున్నప్పటికీ నైజాం మార్కెట్లో మాత్రం ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం ఊహకందని రీతిలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజూ అద్భుతమైన వసూళ్లను రాబడుతూ రవితేజ కెరీర్లోనే నైజాం ఏరియాలో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా దూసుకుపోతోంది. 12వ రోజైన మంగళవారం ఈ చిత్రం నైజాంలో రూ.2.51 కోట్ల గ్రాస్, రూ.1.19 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఓవరాల్‌గా చూసుకుంటే 12 రోజుల్లో రూ. 80.65 కోట్ల గ్రాస్, రూ.43.3 కోట్ల షేర్ (జీఎస్టీ మినహాయించి) వసూలు చేసింది. రెండు వారాలు గడుస్తున్నా కూడా వర్కింగ్ డేస్‌లో సైతం ఈ రేంజులో కలెక్షన్లు వస్తుండటం సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణకు నిదర్శనంగా చెప్పొచ్చు.ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ తన సహజ నటనతో మెప్పించగా, బాలనటి బేబీ నక్షత్ర రవితేజతో కలిసి పండించిన ఎమోషన్స్ ప్రతి ఒక్కరి గుండెలను హత్తుకున్నాయి. వీటికి తోడు సినిమాలోని 'మల్లెపూల పల్లకి' సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి మాస్, ఫ్యామిలీ ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో థియేటర్ల బాట పట్టించింది. భక్తి, కుటుంబ బంధాలు, మాస్ అంశాలు సమపాళ్లలో కుదరడంతో బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' కలెక్షన్ల జోరు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ చిత్రం రూ.250 కోట్ల క్లబ్లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.