© 2026 nimisham.in

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ స్వామివారి పాదాల వద్ద రాకెట్ సెప్టెంబర్ 4న జీఎస్ఎల్వీ ప్రయోగం ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చైర్మన్ ఎస్. సోమనాథ్, ఇతర ఉన్నతాధికారు
లు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఇస్రో బృందం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆనంద నిలయంలోకి ప్రవేశించి స్వామివారి సేవలో పాల్గొంది. రాబోయే ముఖ్యమైన రాకెట్ ప్రయోగానికి ముందు స్వామివారి ఆశీస్సులు పొందడం ఇస్రో శాస్త్రవేత్తలకు ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ జీఎస్ఎల్వీ ఎఫ్-17, ఇఓఎస్-05 (GSLV F-17, EOS-05) రాకెట్ నమూనాను మూలవిరాట్ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. Jai Kottu Logo Launch: జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. పిఠాపురంలో లోగో ఆవిష్కరించిన.. పవన్ కీలక సందేశం సెప్టెంబర్ 4న జీఎస్ఎల్వీ ఎఫ్-17 ప్రయోగం: దర్శనం అనంతరం ఇస్రో చైర్మన్‌కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్‌లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ ద్వారా ఇఓఎస్-05 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్, తుది ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.