© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: భారత వైమానిక దళంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సాయుధ దళాల్లో ఎయిర్ వైస్ మార్షల్ లేదా దానికి సమానమైన హోదాను పొంది
న మొట్టమొదటి మహిళా అధికారిగా (వైద్యేతర విభాగంలో) ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ నిలిచారు. వాయుసేన ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేసింది. మంగళవారం ఆమె దిల్లీలోని ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (విద్య)గా బాధ్యతలు స్వీకరించారని తెలిపింది. గతంలో ఆమె ఎయిర్ కమోడోర్ హోదాలో ఉండేవారని పేర్కొంది.
‘నైసర్’ నిద్రపోలేదు.. ముందే సిగ్నల్స్ పంపింది..!
శక్తి శర్మ 1994లో ఐఏఎఫ్ విద్యావిభాగంలో నియమితులయ్యారు. వైమానిక దళ శిక్షణ సంస్థలు, ఫీల్డ్ స్టేషన్లు, కమాండ్ హెడ్ క్వార్టర్స్, ఎయిర్ హెడ్ క్వార్టర్స్‌లలో విభిన్న బాధ్యతలు నిర్వర్తించారు. ఐఐటీ కాన్పుర్, పుణె విశ్వవిద్యాలయంలో ‘ఐఏఎఫ్ చైర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. త్రివిధ దళాల నుంచి సైనిక పాఠశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేసిన మొదటి మహిళా అధికారిగానూ గతంలో చరిత్ర సృష్టించారు. మూడు దశాబ్దాలకుపైగా విశిష్ట సేవలతో ఆమె అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని వాయుసేన తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Vijay) ఓ రైతు ఇంటికి వెళ్లి సందడి చేశారు.
తమిళనాడులోని కొడైకెనాల్లో సోమవారం రాత్రి ‘గోల్డెన్ మూన్’ (Golden Moon) దర్శనమిచ్చాడు.